కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల..

38
Minister Koppula

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన 21మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ మరియ షాదీ ముబారక్ ద్వారా మంజూరు అయిన చెక్కులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింటి తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఈ పథకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు.

అంతకు ముందు వెల్గటూర్ మండలం రాజారాంపల్లె ఎస్‌ఆర్‌ఆర్‌ గార్డెన్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మరియు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ మైనారిటీ నిరుద్యోగ మహిళలకు కుట్టు శిక్షణపై అవగాహన సదస్సును నిర్వహించారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌.