కొండా సురేఖ బర్తరఫ్..చిన్నారెడ్డిపై వేటు

3
- Advertisement -

అంతా అనుకున్నట్లే జరిగింది. సీఎం రేవంత్ పై కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పదవి నుండి కొండా సురేఖను తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం.ఈ మేరకు లేఖను లోక్ భవన్ కు పంపింది సీఎంవో. అలాగే ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ పదవి నుండి చిన్నారెడ్డిని తప్పించింది అధిష్టానం. ఇక చిన్నారెడ్డి స్థానంలో గద్వాల విజయలక్ష్మీని ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ గా నియమించగా నేరేళ్ల శారదను మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించింది.కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం.

1995లో గీసుకొండ మండల పరిషత్ రాజకీయాలతో కొండా సురేఖ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999,2004లో శాయంపేట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా 2011లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికల్లో పరకాల నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2013లో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించారు

2018లో బీఆర్ఎస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుండి గెలుపొంది రేవంత్ కేబినెట్‌లో దేవాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Also Read:కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం

- Advertisement -