ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డి

226
minister jagadish
- Advertisement -

శుక్రవారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ను సందర్శించిన సమయంలో అక్కడి సిబ్బందికి మంత్రి జగదీష్ రెడ్డి ఇచ్చిన హామీని 24 గంటలలో అమలు పరిచారు. శుక్రవారం రోజున కోదాడ లో జరిగిన రక్తదాన శిబిరాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే.

ఈ క్రమం లోనే ఆయన శుక్రవారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రామాపురం చెక్ పోస్ట్ ను సందర్శించి అక్కడి సిబ్బంది యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

కరోనా వైరస్ నేపధ్యంలో మండు టెండల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అందుబాటులో బత్తాయి ఉంటే తీసుకోవాలని సూచించారు. అందుబాటులో బత్తాయిలు లేవు అంటూ అక్కడి సిబ్బంది మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.

దీనితో స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి బత్తాయిలతో పాటు జ్యుస్ మిషన్ లు పంపుతాను అంటూ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే అక్కడికి రెండు టన్నుల బత్తాయి లతో పాటు రెండు జ్యుస్ మిషన్ లు చేరాయి.

అన్న మాట ప్రకారం మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన రీతిలో బత్తాయిలు అందడం వాటితో పాటు రెండు జ్యుస్ మిషన్ లు రావడంతో అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సిబ్బంది ఆనందం తో పరవశించి పోయారు.

కాగా కోదాడ కు చేరిన బత్తాయిలు, జ్యుస్ మిషన్ లను కోదాడ ఆర్ డి ఓ కిశోర్ కుమార్,స్థానిక డి యస్ పి రఘు కోదాడ రూరల్ సి ఐ శివరాం రెడ్డి లతో పాటు కోదాడ,మునగాల తహసీల్దార్లు సైదులు ఆధ్వర్యంలో సిబ్బందికి అందజేశారు. వేసవి నుండి ఉపశమనం పొందడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే బత్తాయిలు….జ్యుస్ మిషన్ లు పంపించేందుకు చొరవ చూపిన మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు రెవిన్యూ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సరిహద్దు భద్రతా సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -