రాహుల్ గాంధీయే మోడీ గుత్తేదారు:జగదీష్ రెడ్డి

33
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. బీజేపీకి బీఆర్‌ఎస్‌ రిశ్తేదార్‌ కాదని, రాహుల్ గాంధీనే మోడీకి గుత్తేదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతోనని, కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందని చెప్పారు.

రాసిచ్చింది చదవడమే రాహుల్ పని అని…ఆయన లీడర్ కాదు రీడర్‌ అని ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్ రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని వదిలిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని చెబుతున్న రాహుల్… కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Also Read:ఓటీటీ : ఈ వారం కంటెంట్ ఇదే

ఛత్తీస్‌గఢ్‌లో వృద్ధులకు ఇస్తున్నది రూ.350, వికలాంగులకు రూ.500, వితంతువులకు రూ.350 ఇస్తున్నారని తెలిపారు. అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్లోనూ వృద్ధులకు రూ.750, వికలాంగులకు రూ.750, వితంతువులకు రూ.550 మాత్రమేనని వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు రూ.4,000, వితంతువులు, వృద్ధులకు రూ.2016 ఇస్తున్నారని గుర్తుచేశారు.

Also Read:దక్షిణకొరియా సాగు విధానం భేష్..

- Advertisement -