జానారెడ్డిది ఇక గతమే…!

191
Jana
- Advertisement -

నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ నేత జానారెడ్డిది ఇక గతమే అని ఎద్దేవా చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ నామినేషన్ అనంతరం మాట్లాడిన జగదీష్ రెడ్డి…. ఇన్నాళ్లు దీటైన నాయకుడు లేక ఆయన గెలుస్తూ వచ్చారని తెలిపారు.

జానారెడ్డి తన రాజకీయ జీవితంలో నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు….. ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు సైతం ఇవ్వలేక పోయారని మండిపడ్డారు.సాగర్ ఎడమ కాలువ కింద మొట్టమొదటి రాజవరం మేజర్‌కే సాగునీళ్లు రాలేదు అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిందని అన్నారు.

జానారెడ్డి సవాలు గమ్మతుగా ఉందని.. నామినేషన్ వేసి ప్రచారం చేయకుండా ఎవరి ఇంట్లో వారే ఉందాం అని అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జానారెడ్డి మాటల్లో ఓటమి భయం కనపిస్తుందన్నారు. 2018 ఎన్నికల ఫలితం పునరావృతం ఖాయం అన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి.

- Advertisement -