Jagadish Reddy:వైద్యరంగంలో పెనుమార్పులు

80
- Advertisement -

సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులతో వైద్యరంగం మరింత మెరుగుపడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట పట్టణంలోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో టీ-డయాగ్నస్టిక్ హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి..ఈ కేంద్రాలలో 134 వైద్యపరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇటీవల కాలంలో మహిళలు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ల వంటి బారిన పడుతుండటాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్యాన్సర్లను ముందుగా గుర్తించే మమోగ్రఫీ టెస్టులను కూడా తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ అన్నారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యరంగంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన టీ-డయాగ్నస్టిక్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కోరారు.

Also Read:Kamal Hassan:రైతు సమస్యలపై మూవీ

- Advertisement -