సీఎం కేసీఆర్ సభ సక్సెస్‌: మంత్రి జగదీష్ రెడ్డి

147
jagadish reddy
- Advertisement -

ఉమ్మడి నల్గొండ జిల్లా పై సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ప్రేమ, అభిమానాలు ఉన్నాయి….అందుకే వరాల జల్లు కురిపించారని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ లోని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నివాసంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్,చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి తదితరులతో కలిసి మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి….నిన్న హాలియా లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ధన్యవాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది…..విజయవంతం చేసిన నాయకులకు , రైతులకు, కార్యకర్తలు లకు ప్రతి ఒక్కరికి పెరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే పెద్ద నాయకులం అవుతాం అని ప్రతిపక్షాలు భ్రమలో బ్రతుకుతున్నాయని చెప్పారు.

ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి…..చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. అభివృద్ధి ని , టీఆర్ఎస్ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేకనే కళ్ళు మండి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పై జానారెడ్డి చేసిన సవాలును స్వీకరించి అభివృద్ధి పై చర్చకు సిద్ధం అంటే ఇప్పటివరకు జానారెడ్డి నుంచి ఉలుకు పలుకు లేదన్నారు.

ఈ ఆరేళ్ళ లో జరిగిన అభివృద్ధి ని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తాం అంటే జానారెడ్డి ముందుకు రావడం లేదు….కాంగ్రెస్ నాయకుల చేతకాని తనం వల్లనే జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ప్రజలను జీవచ్చలా మార్చింది….ఫ్లోరైడ్ ను ఏ విధంగా పారద్రోలినమో చర్చిద్దాం అంటే జానారెడ్డి ముందుకు రావడం లేదన్నారు. ఉద్యమ కాలం లొనే సీఎం కేసీఆర్ జిల్లాలో ఇంచు ఇంచు తిరిగి సమస్యలను తెలుసుకున్నారు……ఈనాడు అన్నింటిని పరిష్కరిస్తూ వస్తున్నారని చెప్పారు.

ఆసియా లొనే అతి పెద్ద యాదాద్రి ధర్మల్ ప్లాంట్…..యాదాద్రి ఆలయము, మూడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు,దండుమల్కాపురం పార్క్ ఇవి అన్ని జిల్లాకు మణిహారం ల నిలిచాయని చెప్పారు. పాలమూరు డిండి ప్రాజెక్ట్ ను కూడా త్వరలోనే పూర్తి చేస్తాం….సాగర్ ఎడమ కాలువ కింద టైల్ అండ్ భూముల పేరిట సాగు నీళ్లు ఇవ్వకుండా రైతులను ఎడిపించారు కాంగ్రెస్ నాయకులు అని మండిపడ్డారు. అభివృద్ధి అంటేనే కేసీఆర్… కేసీఆర్ అంటేనే అభివృద్ధి……ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ రాష్ట్రాం అన్ని రంగాల్లో ముందజేలో నిలిచిందన్నారు.

- Advertisement -