- Advertisement -
శనివారం ఉదయం విధులకు వెళ్తున్న ఓ విద్యుత్ ఉద్యోగిపై నల్లగొండ పోలీసులు దాడి చేశారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ 2 గంటల పాటు విద్యుత్‌ను నిలిపివేశారు. మొత్తానికి ఉన్నతాధికారుల జోక్యంతో ఉద్యోగులు విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.
విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డితో మంత్రి జగదీశ్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. విద్యుత్ శాఖ అత్యవసర సర్వీసు కిందకు వస్తుంది. అత్యవసర సర్వీసులకు ఆటంకం కలిగించొద్దు అని సూచించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి. అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని జగదీశ్ రెడ్డి ఆదేశించారు.
- Advertisement -