అవినీతి ‘స్కాంగ్రెస్’ బంగాళాఖాతంలోకే: మంత్రి జగదీష్ రెడ్డి

155
jagadishreddy
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం మరో సారి బయట పడిందని మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి…..గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు ,ఎంచుకున్న అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ ఏ రకంగా చూసినా దేశం లో నెంబర్ వన్ అని అధికార ,అనధికార నివేదికలన్నీ స్పష్టం చేస్తున్నాయని వెల్లడించారు.

నల్లగొండ లో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదంటే అది మిషన్ భగీరథ విజయవంతం అయిందనడానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ లో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కు వణుకు పుడుతోందని ..అందుకే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరవై సంవత్సరాల కాంగ్రెస్ ఫ్లోరిన్ దుర్మార్గాన్ని రూపు మాపగలిగాం …అభివృద్ధిని జీర్ణించుకోలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు కు కాంగ్రెస్ అవినీతి రంగు పులుముతోందన్నారు.

ఉత్తమ్ కు కొద్దిగానైనా సిగ్గు ,లజ్జ ఉండాలి…కళ్ళముందు కనిపిస్తున్న కాళేశ్వరం గొప్పతనం ఉత్తమ్ కు కనిపించడం లేదన్నారు. కాళేశ్వరాన్ని అడ్డుకునేందుకు 350 కేసులు వేశారు …కెసిఆర్ సంకల్ప బలం ముందు కాంగ్రెస్ కేసులు నిల్వ లేదన్నారు. అవినీతి చేసిందనే కాంగ్రెస్ ను ప్రజలు 2014 లో బంగాళా ఖాతం లో కలిపారన్నారు. ఉత్తమ్ ప్రగల్భాలు పలుకుతారు …ఎన్నికలప్పుడు కారులో డబ్బులు దొరికితే ఉత్తమ్ కాలబెట్టారన్నారు.

సీఎం కెసిఆర్ అవినీతి చేశారని సిబిఐ కు పిర్యాదు చేస్తామని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు……కాంగ్రెస్ నేతల అవినీతి చరిత్ర ఢిల్లీ లోని దర్యాప్తు సంస్థలకన్నిటికి తెలుసు అన్నారు. కాంగ్రెస్ నేతలు దర్యాప్తు సంస్థలకు ఏమని పిర్యాదు చేస్తారు ?…ప్రజలకు కెసిఆర్ పెన్షన్లు ఇస్తారని పిర్యాదు చేస్తారా ?…ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణ లో జరుగుతున్నందుకు పిర్యాదు చేస్తారా ?..కాళేశ్వరం నీళ్లు వెనక్కి పంపాలని పిర్యాదు చేస్తారా ? అని ఎద్దేవా చేశారు.

- Advertisement -