తిరుగుబాటు తప్పదు: కోమటిరెడ్డిపై జగదీష్ రెడ్డి ఫైర్

104
jagadishreddy
- Advertisement -

కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల్లో విశ్వాసం కొల్పోయారని….వారిపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని చూసి సొంత నియోజకవర్గ ప్రజలే చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

వారి ధ్యాస డబ్బు సంపాదన పైనే ఉంటుందని…పనులు చేయడంలో ఉండదని ఎద్దేవా చేశారు. మీడియా ప్రచారం కోసమే వారి ఆర్భాట౦ కానీ, ప్రజలకు సేవ చేయాలనే సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవలె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జగదీష్ రెడ్డికి మాటల యుద్దం జరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఇకపై ఊరుకునేది లేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు ఊడదీస్తానని హెచ్చరించారు జగదీష్ రెడ్డి.

- Advertisement -