బీజేపీ నేతలా…వీధి రౌడిలా..?

143
bjp

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బీజేపీ నాయకులు వీధి రౌడిలా ప్రవర్తిస్తున్నారు. హుజూరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి ప్రయత్నించారు. దళిత బంధు పథకాన్ని, దళితులను కించ పర్చే విధంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావ మరిది మధుసుదన్ రెడ్డి వాట్సప్ చాటింగ్ చేయడాన్ని నిరసిస్తూ కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో దిష్టి బొమ్మ దహనం చేస్తుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు రువ్వుకున్నారు. అంతేకాకుండా ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈటల ఖబర్దార్‌..హద్దుమీరి అనైతికంగా ప్రవరిస్తే సహించే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.