మంత్రుల తీరుపై ప్రజల్లో అసహనం: జగదీష్ రెడ్డి

15
- Advertisement -

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రాజెక్టు పై అవగాహన లేక మంత్రులు పరువు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని జగదీష్‌ రెడ్డి అన్నారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదన్నారు. నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్లారాచూశానన్నారు. టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పాం అన్నారు.

నాడు సమైక్యాంధ్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. ఓ మంత్రి వాటర్‌లో నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమోడియన్ అయ్యాడు. గోడకు చెవులు పెట్టడం..సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read:వీడియో..అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం

- Advertisement -