ఎల్ బి నగర్ నియోజకవర్గం ఇకఫై సిగ్నల్ ఫ్రీ జోన్ గా మారా బోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో స్వర్గధామలుగా నిర్మించిన శ్మశానవాటికలలో సైతం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో పార్కులు అంటేనే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డలుగా నిలిచేవని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి పార్కులను ఆధునికరించడమే కాకుండా స్వర్గధమాలలో నిర్మితమైన పార్కులు సైతం అదే ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం నుండి ఎల్ బి నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగోజిగూడా, సరూర్ నగర్ డివిజన్ లలో మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అపార్ట్మెంట్ వాసులతో విస్తృతంగా సమావేశాలు, కాలనీ సంక్షేమ సంఘాలతో బహిరంగ సమావేశాలు,డివిజన్ ల వారిగా బూత్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు.మధ్యాహ్నం కొత్తపేట ప్రాంతంలోనీ పాపడం హోటల్ సమావేశ మందిరంలో నిర్వహించిన సరూర్ నగర్ బూత్ స్థాయి కమిటీల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బి నగర్ అంటేనే ట్రాఫిక్ భయం ఉండేదని అటువంటి ప్రాంతంలో సిగ్నల్ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేసేందుకు టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖామంత్రి కే టి రామారావు ప్రణాళికలు రూపొంచారని ఆయన వెల్లడించారు.ఇప్పటికే అక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు,అండర్ బైపాస్ రోడ్లతో ట్రాఫిక్ నియంత్రణ సులభ తరమైందన్నారు. అటువంటి అభివృద్దే బల్దియా ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలుపు సులభతరం చేసిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.2014 ఎన్నికలకు ముందు తరువాత అన్నదే ఇప్పుడు బల్దియా ఎన్నికల్లో ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు.తెలంగాణ ఏర్పడక ముందు ఎల్బి నగర్ లాంటి శివారు ప్రాంతాల్లో దొంగలు సృష్టించే బయోత్పాతం ఆకతాయిల అఘాడలతో అటు ఆడపిల్లలు ఇటు మహిళలు ప్రాణభయంతో తల్లడిల్లిన రోజుల నుండి విముక్తి అయ్యారు అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అని ఆయన చెప్పుకొచ్చారు. షి టీం లు ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన కొనియాడారు.అంతటితో ఆగకుండా నగర వ్యాప్తంగా సిసి కెమెరాలు పెట్టి ఆగడాలకు అడ్డుకట్ట వేసిన చరిత్ర కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే నని ఆయన చెప్పారు.
అంతకు మించి మహానగరం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య కు శాశ్వతపరిష్కారం కనుగొన్నది ఈ ప్రభుత్వం లోనేనన్నది ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. ప్రదానంగా హైదరాబాద్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లి తండ్రులకు పెద్ద పరీక్షగా మారేదాని అటువంటి అగ్నిపరిక్షకు పరిష్కారం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో చూపిన దార్శనికుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ఈ ఎన్నికల్లోనూ బల్దియాలో 2016 ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయన్నారు.వందకు పైగా స్థానాలలో టిఆర్‌ఎస్ పార్టీ విజయదుందుభి మోగించ బోతుందని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ కు చెప్పుకుందాం అంటే బల్దియాలో గతం లేదు వర్తమానం ఉంటుందో లేదో అనుమానాస్పదంగా ఉంది.భవిష్యత్ ఉంటుందో ఉండదో ఎవరికీ తెలియదని ఆయన ఎద్దేవాచేశారు. బిజెపి, మజ్లీస్ ల మ్యానిఫెస్టో లు నగరంలో అల్లకల్లోలం సృష్టించడమేనని ఆయన ఆరోపించారు. విగ్రహాలు కూలగొడతామని ఒకరు…కార్యాలయాలు కూల్చి వేస్తామని మరొకరు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు.బల్దియా ఎన్నికల్లో ఓటర్లకు కావాల్సింది అల్లకల్లోలం, అరాచకం కాదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండగా హైదరాబాద్ లో ఏ ఒక్కరు పూచిక పుల్లను కదిలించలేరన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కిలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
కాగా ఆయా కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి వెంట శాసనమండలి సభ్యులు శేరి సుభాష్ రెడ్డి, లింగోజిగూడా డివిజన్ లో స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి డివిజన్ ఎన్నికల ఇంచార్జ్ జడ్చర్ల శాసనసభ్యులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి లతో పాటు టి ఆర్ యస్ అభ్యర్థి శ్రీనివాసరావు పాల్గొనగా సరూర్ నగర్ డివిజన్ బూత్ స్థాయి సమావేశం లో సరూర్ నగర్ డివిజన్ అభ్యర్థిని అనితా దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.