- Advertisement -
సీఎం కేసీఆర్ కృషితోనే తెలంగాణ విద్యుత్ రంగంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యపేట జిల్లా కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్ధాపన చేసిన జగదీశ్ రెడ్డి…ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ విద్యుత్ రంగంపై చర్చించుకుంటుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం విద్యుత్ సమస్యపై మొదలైందని…స్వరాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందన్న వారికి కేసీఆర్ తన మేధస్సుతో సమాధానం చెప్పారని తెలిపారు. అనతికాలంలోనే విద్యుత్ సమస్యను అధిగమించి..24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
శాంతినగర్‌లో నిర్మించిన సబ్ స్టేషన్‌తో గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. లో వోల్టేజీ సమస్యను నివారించడంలో విద్యుత్ శాఖ అద్భుత ఫలితాలు సాధించిందన్నారు.
- Advertisement -