జాతరలో డప్పులు వాయించి సందడి చేసిన మంత్రి.. వీడియో

86
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం లోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్-లింగమంతుల స్వామి జాతర, పెన్ పహాడ్ మండల కేంద్రంలో చౌడమ్మ జాతర, సూర్యాపేట మండలం టేకుమట్లలో గంగమ్మ జాతరలలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం అన్నారు. గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాలు ప్రత్యేకమైనవన్నారు.పల్లెల్లో దేవతలను, దేవుళ్లను, పుణ్య స్త్రీలను, మహిమగల స్త్రీ, పురుషలను పూజించడం అనాదిగా వస్తూవుందన్న మంత్రి ఏదైనా ఒక దేవతను గాని, దేవుని గాని కొన్ని నిర్ధిష్టమైన రోజులలో పూజించి పండగ చేయడాన్ని జాతర అంటారన్నారు.. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ చౌడమ్మ, గంగమ్మ, లింగమంతుల స్వామీ దయతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

యాదవ పెద్దలతో కలిసి మంత్రి అయా జాతరలలో డోలు వాయించి సందడి చేశారు. ఇందులో యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి వెంట ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది బిక్షం, జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, సూర్యాపేట జడ్పీటిసి, ఎంపిపి కు జీడి బిక్షం, రవీందర్ రెడ్డి, అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, ఆత్మకూర్ ఎస్ ఎంపిపి. మర్ల స్వర్ణలత చంద్రా రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు తూడి నర్సింహ రావ్, బత్తుల ప్రసాద్ యాదవ సోదరులు, కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు.

- Advertisement -