సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని కేసారంలో రైతు వేదిక మరియు ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని మంగళవారం మంత్రులు జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డి,సివిల్ సప్లైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు చైతన్యం కలిగించేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నం. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై..ఆదాయాన్ని పెంచుకునే పంటలపై దృష్టి పెట్టాలి అని మంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు, రైతుభీమా పథకాలు తీసుకొచ్చారు. నిరంతర ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వరిసాగులో తెలంగాణా టాప్‌లో ఉంది. ఖరీఫ్ కంటే రబిలోనే ఎక్కువ దిగుబడి వస్తోంది. ప్రత్యేక తెలంగాణాలో వ్యవసాయం పండుగ చేశారు..అసాధ్యన్నీ సుసాద్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు.