బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు కరోనా పాజిటివ్..

155
Katrina Kaif
- Advertisement -

బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా తొలినాళ్లలో కంటే సెకండ్ వేవ్‌లో దాని బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. గత కొన్నిరోజుల వ్యవధిలోనే అక్షయ్ కుమార్, అలియా భట్, వికీ కౌశల్, భూమి పెడ్నేకర్ తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. తనకు కరోనా వచ్చిందని, స్వయంగా ఇన్ స్టాగ్రామ్ స్టేటస్‌లో తెలిపింది.

మెడికల్ టెస్టుల్లో పాజిటివ్ అని వచ్చిన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లానని కత్రినా తెలిపింది. వైద్యుల సలహాల మేరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నానని వివరించింది. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కత్రినా సూచించింది. తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు పొంగిపోతున్నానని, ప్రతిఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని అమ్మడు ఓ ప్రకటన చేసింది.

- Advertisement -