నియంత్రిత సాగు విధానంపై చర్చించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సులు జోరుగా సాగుతున్నాయి. మండు టెండల్ని సైతం లెక్కచేయకుండా మంత్రి జగదీష్ రెడ్డి రోజుకు మూడు నియోజిక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సదస్సుల్లో పాల్గొంటూ నియంత్రిత సాగు విధనం యెక్క ఆవశ్యకతను వివరిస్తున్నరు.ఈరోజు నక్రేకల్, నల్లగొండ, మునుగోడు నియోజిక వర్గాల్లో నిర్వహించిన సదస్సుల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు ఆలోచన కూడా చేయని సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నరని,తమ పంటలకు ధర నిర్ణయించే శక్తిని రైతుకు అందించేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
అందులో భాగంగానే రైతుల్ని సంఘటితం చేసి, డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే సాగు చేసే విధంగా నియంత్రిత సాగు విదానాన్ని అమలు పరుస్తున్నరని మంత్రి అన్నారు. తెలంగాణా ఉద్యమకాలం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం రైతుల గురించే ఆలోచన చేశారని, స్వరాష్ట్రంలో స్వయాన రైతైన కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత రైతుల తల రాతలు మార్చారని జగదీష్ రెడ్డి అన్నారు. బంగారు పంటలు పండే సమశీతోష్ణ స్దితి గల భూములు తెలంగాణాలో ఉన్నాయని,దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోని డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసి లాభాలు గడించాలని మంత్రి జగదీష్ రెడ్డి రైతుల్ని కోరారు.
దార్శనికత, అంకిత భావం ఉన్న కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల అద్రుష్టమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నదని మంత్రి అన్నారు. ఈ సదస్సులో మండలి డిఫ్యూటీ ఛైర్మెన్ విద్యా సాగర్, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ ఛైర్మెన్ లు బండా నరేందర్ రెడ్డి,సందీప్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి,బీసీ కార్పోరేషన్ ఛైర్మెన్ శంభయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటీల్, రైతు బంధు సమితి అద్యక్షుడు రాంచంద్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.