సూర్యాపేటలో కరోనా పూర్తిగా తగ్గింది..

328
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడి అయిందని, ప్రజలెవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పేదలకు, పారిశుద్ధ్య సిబ్బందికి బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ప్రజల సహకారం, అధికారులు కృషి వల్లనే సాధ్యం అయిందని అన్నారు.

టెస్టులు చేయకపోవడం వల్లనే కేసులు నమోదు కావడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం వారి దివాలకోరు తనానికి నిదర్శం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారని, దాని ఫలితంగానే రాష్ట్రంలో కరోనా మహమ్మారిని అదుపు చేయగలిగారని అన్నారు. ఇక లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

రేషన్ కార్డ్ లేని వారికి, వలస కార్మికులుకు అందరికి బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని అన్నారు. ఎ ఒక్కరు ఆకలితో ఇబ్బందులు పడొద్దన్న సీఎం కేసీఆర్ పిలుపుమేరకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు వారి ప్రాంతాల్లో ఉన్న పేదవారికి, వలస కార్మికులుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు. అపోహలను, వదంతులను నమ్మకుండా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను పాటించి, ఇంటికే పరిమితం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.

- Advertisement -