దీపాలు వెలిగించే ముందు శానిటైజర్ వాడొద్దు..

310
Minister Jagadish Reddy

రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్ పై ఎలాంటి ప్రభావం పడదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఇంట్లో లైట్లు బంద్‌చేసి దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ,తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ పవర్ గ్రిడ్ కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు.

తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉంది. మా ఇంజనిర్స్ అందరూ వారి జాగ్రత్తలో వారు ఉన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము. కొంత మంది ఆకతాయిల పని. ఇటువంటి ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ. సీఎం కేసీఆర్ జాతి ఐక్యత కొసం విద్యుత్ దీపాలు అర్పివేసి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. అందరు వారి ఆదేశలను పాటించాలని మంత్రి తెలిపారు.

9 గంటల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు మీ మీ యిండ్లలో దీపాలు వెలిగించే సందర్భంలో మీ చేతులకు శానిటైజర్ ఉంటే ప్రమాదం పొంచి ఉందన్న ఆ విషయం మరచి పోకండి. స్పిరిట్ తో తయారైన శానిటైజర్ దీపాలు ముట్టించే సమయంలో మీ చేతికి ఉంటే మీ చేతులు కూడా అంటుకుంటాయయి అందుకే మంచినీళ్లుతో చేతులు కడుక్కొని దీపాలు వెలిగించాలి. ప్రజా ఆరోగ్యం కొరకే అని భావించి ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని మీ మీ ఇండ్ల ముందట దీపాలు వెలిగించి కరోనా రక్కసిని పారద్రోలడంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను అని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు.