నాగలి పట్టి పొలం దున్నిన జగదీష్ రెడ్డి..

596
Jagadish Reddy
- Advertisement -

తొలకరి చినుకులు పడుతుండటంతో సూర్యాపేట జిల్లాలో రైతులు ఉత్సాహంగా ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకున్నరు..సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని పాడికి పూజలు చేసి, నాగలి పట్టి పొలం దున్నారు. ఆనాతి కాలం నుంచి రైతులు ఏరువాకను సంతోషాల నడుమ జరుపుకునేవారని,సమైక్య పాలకులు తెలంగాణలోని వ్యవసాయాన్నీ ధ్వసం చేసి, రైతులను నట్టేట ముంచడంతో ఏరువాక లాంటి పండుగలకు తెలంగాణలో రైతులు దూరం అయ్యారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

స్వయాన రైతైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో 24 గంటల కరంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు ఇతర ప్రాజెక్ట్ లను పూర్తి చేయడంతో కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ ససస్యశామలం అయిందని మంత్రి అన్నారు.ముఖ్యంగా సూర్యాపేట జిల్లా రైతులకు దశాబ్దాల కలగా మారిన గోదావరి జలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని జగదీష్ రెడ్డి అన్నారు.గత యసంగిలో వరుసగా 6 నెలల పాటు సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలు సందడి చేశాయని, ఫలితంగా రాష్ట్రంలో అత్యధికంగా పంట దిగుబడులు సూర్యాపేట రైతులు పండించారని మంత్రి అన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణా ,గోదావరి, మూసి జలాలతో రైతులు బంగారు పంటలు పండిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.ఇప్పటికే తెలంగాణలో వ్యవసాయం గాడిన పడిందని, ఈ సారి ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న నియంత్రిత సాగు పంటల విధానం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి, రైతులను సంఘటితం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. వందలాది మంది రైతులతో నాగలి పట్టి, పొలం దున్ని హాలధారిగా మారడం సంతోషంగా ఉందని, మట్టితో మమేకమై ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదాని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, జెడ్సీ చైర్ పర్సన్ దీపికా, వందలాది మంది రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -