- Advertisement -
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో శనివారం సీఎం కేసీఆర్ ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సభ ఏర్పాట్ల పూర్తి అయ్యాయి. ఈ సభ ఏర్పట్ల పనులను మంత్రి జగదీష్ రెడ్డి, ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్యే సైదిరెడ్డిలు పరిశీలించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,జిల్లా ఎస్పీ భాస్కరన్, పలువురు అధికారులు ఉన్నారు.
గురువారం హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 43,233 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. హుజూర్ నగర్‌లో చరిత్రలోనే ఈ స్థాయిలో రికార్డ్ మెజార్టీతో గెలిచిన సైదిరెడ్డి… రాష్ట్రంలో టీఆర్ఎస్ హవా ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు.
- Advertisement -