వరి దిగుబడిలో తెలంగాణ నెం.1: మంత్రి జగదీష్ రెడ్డి

139
Minister Jagadish Reddy
- Advertisement -

నల్లగొండ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి మండలం మామిడాల గ్రామం నుండి మోత్కుర్ వరకు 9 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రహదారి నిర్మాణపు పనులకు శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయన అదే మండల పరిదిలోని ఖాజీరామరం, అనిశెట్టి దుప్పలపల్లి, తిప్పర్తి,మామిడాల,పజ్జుర్ గ్రామాలలో నిర్మించిన రైతువేదికలతో పాటుతిప్పర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక సహకార సంఘ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలోటెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ రామచంద్ర నాయక్ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,తిప్పర్తి యంపిపి నాగులాంచవిజయలక్ష్మి లింగరావు, జడ్ పి టి సి పాశం రాంరెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ పాశం సంపత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఏమిఇచ్చారు అని ప్రశ్నిస్తున్న వారికి రైతుబంధు సరయిన సమాధానం అని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంత పంట దిగుబడి అయిందో ప్రస్తుతం ఒక్క తెలంగాణా రాష్ట్రంలో అంతటి పంట దిగుబడి అయి ధాన్యం దిగుబడిలో యావత్ భారతదేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లా 19 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సరికొత్త రికార్డ్ నమోదు చేసిందన్నారు. మొన్నటి యాసంగిలో రాష్ట్ర వ్యాప్తగా 90 లక్షలమెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 19 లక్షల మెట్రిక్ టన్నులు పండిందన్నారు. అందులో ముందెన్నడూ లేని రీతిలో నల్లగొండ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఒక రికార్డేనన్నారు.

తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఎక్కువ లబ్ది పొందింది కుడా ఉమ్మడి నల్లగొండ జిల్లాయోనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌తో పాటు సాగుకు అవసరమైన నీరు సరిపడ ఇస్తున్నందున రైతాంగం ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. మూస పంటలకు స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపగలిగితే ఆర్థికంగా పరిపుష్టి సాధించ వచ్చాన్నారు. వైవిధ్యమైన భూములు తెలంగాణలో ఉన్నాయాన్నారు. ప్రపంచానికి అవసరమైన అన్ని రకాల పంటలు పండించేందుకు అనువైన భూములు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. పత్తి,కంది,పెసర,వేరుశనగ లతో పాటు తోటల సాగువైపు రైతులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఉహకందనివి, కలలో కుడా ఊహించని పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. తద్వారా అభివృద్ధితో పాటు ఆర్థికాభివృద్ధి సాదనకు మార్గం సుగమైందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

- Advertisement -