రైతులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం- మంత్రి జగదీష్ రెడ్డి

193
minister jagadish reddy
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో, నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలను సోమవారం రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి,నకిరేకల్ శాసన సభ్యులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిలు కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్, ఎంపీపీ జ్యోతి బలరాం, జడ్పిటిసి పున్న లక్ష్మి, సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రూ.50 లక్షలకు పైగా బీడు భూములను సాగులోకి తీసుకువచ్చి సీఎం కేసీర్ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సృష్టించింది అని అన్నారు. రైతులకు పంట వేసే ముందు పెట్టుబడి సహాయం అందిస్తూ వారికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లను మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తూ ఫ్లోరోసిస్ వ్యాధి లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

- Advertisement -