జోగులాంబా బ్రహ్మోత్సవాలు.. మంత్రి అల్లోలకు ఆహ్వానం..

170
Minister Indrakaran Reddy
- Advertisement -

ఈ నెల 12 నుంచి 16 వరకు అలంపూర్ శ్రీ జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ జోగులాంబా అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అలంపూర్ ఎమ్మెల్యే డా. అబ్ర‌హం, ఆల‌య చైర్మ‌న్ ర‌విప్ర‌కాష్ గౌడ్, ధ‌ర్మ‌క‌ర్త‌ న‌ర్సింహారెడ్డి, దేవాస్థాన అర్చ‌కులు అర‌ణ్య భ‌వ‌న్‌లో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని బ్రహ్మోత్సవాలకు రావలసిందిగా వారు కోరారు. అనంతరం మంత్రికి అమ్మ‌వారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందించి సత్కరించారు.

- Advertisement -