మంత్రి ఔదార్యానికి ఫిదా అవుతున్న ప్రజలు..

99
- Advertisement -

తనకు వచ్చింది కరోనా అని ఆ పసి మొగ్గకు తెలియదు…తల్లిదండ్రులు కూడా గుర్తించడంలో ఆలస్యం చేశారు. దీంతో రక్కసి బారిన పడి తీవ్ర మైన ఊపిరితిత్తుల సమస్యతో ఎనిమిది నెలలుగా ఆక్సిజన్ సహాయంతో అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని వైద్యులు సైతం ఇక మా వాళ్ళ కాదు అన్నారు..ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల మధ్య దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారికి,ఆమె కుటుంభ సబ్యులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. అధైర్య పడకండి..అండగా ఉంటా అని మంత్రి ఇచ్చిన భరోసా చిన్నారి కుటుంభంలో ఆత్మ స్థైర్యం ను నింపింది.

నాయకుడంటే పబ్లిసిటీ, హంగు ఆర్బటాలు కాదు..ప్రజల గుండె చప్పుడు విని వారి ఇబ్బందులను తొలగించే వాడని నిరూపించారు మంత్రి జగదీశ్ రెడ్డి.గత మూడు రోజులుగా సూర్యాపేట మున్సిపల్ పరిధిలో కల్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ చెక్ లను స్వయంగా పాదయాత్ర చేసుకుంటూ మేనమామ తరహాలో లక్షా నూటా పదహార్లు నగదు చెక్ లను 177 కుటుంబాలకు అందజేసి వారి కుటుంబాలలో కల్యాణ కాంతులను నింపిన మంత్రి జగదీశ్ రెడ్డి.. పర్యటనలో తన కంట పడిన విధి వంచితులు, అభాగ్యులకు అండగా నిలిచి నాయకుడు అనే పదానికి అసలైన నిర్వచనంగా నిలిచి సూర్యాపేట ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు.

సూర్యాపేట 20 వార్డ్ జమ్మిగడ్డకు చెందిన గోపాగాని శ్రీ విద్య-అశోక్ ల గారాల పట్టి చైత్రకు 9 ఏళ్ళు.8 నెలల క్రితం కోవిడ్ బారిన పడింది.. కరోనా రక్కసి చిన్నారి శరీరంలోని అవయవాలను ఛిద్రం చెస్తున్నా..తల్లిదండ్రులు సమయానికి గుర్తించలేకపోయారు. తీరా గుర్తించె సరికి తీవ్ర మైన ఊపిరితిత్తుల సమస్య, నరాల సమస్య చిన్నారిని ఉక్కిరిబిక్కిరి చెసింది.. ఏ ఆసుపత్రికి వెళ్లినా నయం కాలేదు..పల్స్ జీరోస్థాయిలో ఆశలు వదులుకున్న చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు. ఎనిమిది నెలలుగా కేవలం ఆక్సిజన్ సహాయం తోనే.. చిన్నారి ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. ఇదే సందర్భంలో 20వ వార్డులో కళ్యాణ లక్ష్మీ చెక్ లను అందించడానికి వచ్చిన మంత్రి దృష్టికి చిన్నారి ఆరోగ్య పరిస్థితి రావడం, వెంటనే చిన్నారి ఇంటికి వెళ్లి నేను ఉన్నా అంటూ భరోసా కల్పియ్యడం చకా చకా జరిగిపోయింది. నిమిషాల వ్యవధిలో సూర్యాపేట మెడికల్ కళాశాల వైద్య సిబ్బందితో మాట్లాడిన మంత్రికి చిన్నారికి నయం అయ్యే ట్రీట్మెంట్ మన వద్దే ఉందని ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టేశారు.

ప్రస్తుతం చిన్నారికి అత్యున్నత స్థాయిలో వైద్య సిబ్బంది సమక్షంలో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నారికి వైద్యం అందియ్యడానికి గుంటూరు, నిలోఫర్,ఖమ్మం ఆసుపత్రుల చుట్టూ తిరిగి అలసిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులు జగదీశ్ రెడ్డి రూపంలో దేవుడు మా ఇంటికి వచ్చాడని చెబుతున్నారు.. మా చిన్నారి అనారోగ్యంను నయం చేసే విషయంలో మంత్రి గారే మా కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడుతున్నారు.

- Advertisement -