మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో ప్రయాణికులకు విముక్తి..

492
Minister Jagadish Reddy
- Advertisement -

కరోనా ప్రభావంతో తెలంగాణలోని అన్ని సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లు బంద్ చేశారు. అయితే ఈ రోజు అర్ద రాత్రి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న బార్డర్ చెక్ పోస్ట్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఎత్తివేశారు. నిన్నటి నుంచి చెక్ పోస్ట్‌ల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రయాణికులను వెంటనే వారి వారి స్వస్తలాలకు పోయేలా అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి
జగదీష్ రెడ్డి.

నల్గొండ జిల్లా లో నాగార్జున సాగర్ వద్ద.. వాడపల్లి వద్ద.. సూర్యాపేట జిల్లాలో ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు కోదాడ వద్ద.. హైదరాబాద్ జంట నగరాల నుంచి వేల వాహనాల్లో తరలి వచ్చి అనుమతి లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. అయితే వారి ఇబ్బందులను మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.. ఫోన్‌లో సీఎం కేసీఆర్‌కు పరిస్థితిని వివరించారు.. దీనితో పాటు స్వయంగా పోచంపల్లి, వాడపల్లి వద్ద చెక్ పోస్ట్ లను సందర్శించి వాస్తవ పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు మంత్రి జగదీష్ రెడ్డి వివరించారు.

సీఎం కేసీఆర్ సూచన మేరకు వెంటనే చెక్ పోస్ట్ లను ఈ రోజు అర్ధ రాత్రి వరకు ఎత్తి వేసి ప్రయాణికులును వారి స్వస్తలాలకు వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. సీఎం కేసీఆర్ కు,ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డికి అలాగే మంత్రి జగదీష్ రెడ్డికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -