సూర్యాపేటలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆద్వార్యంలో పాస్టర్లకు బియ్యం,నిత్యవసర సరుకుల్ని మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీ బడుగుల లింగయ్య ,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు,టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, గ్రంధాలయ ఛైర్మెన్ నిమ్మల శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ ఛైర్మెన్ కిశోర్ లతో కలిసి పట్టణంలోని 10,21,48, వార్డుల్లో పేదలకు బియ్యం, నిత్యవసరాలను మంత్రి పంపిణీ చేశారు.అలాగే కొన్ని కాలనీల్లో కూరగాయల మర్కెట్‌లను ప్రారంభించారు మంత్రి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాతో చేస్తున్న యుద్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే దారి చూపించాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏ ఒక్కరు ఆకలితో ఇబ్బంది పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ 12 కిలోల రేషన్ బియ్యం, 3 వేల రూపాయల ఆర్దిక సాయం చేశారని అన్నారు. కార్డ్ లేని వారికి వలస కార్మీకులకు కూడా బియ్యం పంపిణీ చేసి, ఆర్దిక సాయం చేసిన గొప్ప మనస్సు కెసీఆర్ దని ఆయన అన్నారు.
నంద్యాల దాయకర్ రెడ్డి చొరవతో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు నిజామాబాద్ నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి సూర్యాపేట జిల్లాలోని పాస్టర్లకు అండగా ఉండటం అభినందనీయమని ఆయన అన్నారు. మీటర్ దూరంలో కరోనా మహమ్మారి ఉందని,ఎవ్వరికి వారు అప్రమత్తంగా ఉండి కరోనా నుంచి కాపాడుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.ఆ ఆపత్కాలంలో తెలంగాణ సమాజం చూపించిన సహనం, క్రమశిక్షణ దేశానికే ఆదర్శంగా నిల్చాయని జగదీష్ రెడ్డి అన్నారు.