మునుగోడులో టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు మండలం సోలిపురం గ్రామంలో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకీ చెందిన సర్పంచ్ తో పాటు గ్రామస్తులందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది అందే వేసిన చెయ్యని తెలిపారు. సోలిపురంలో బ్రిడ్జి,రహదారుల నిర్మాణం వంటి పనులు పేరుకపోయాయి అంటే అందుకు కారణం ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకుల వైఫల్యం అని తెలిపారు. ఆయన స్పష్టం చేశారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా మునుగోడు ప్రజలను కభళించిన ఫ్లోరోసిస్ భూతాన్ని మిషన్ భగీరథ పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పార ద్రోలిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వాస్తవానికి ఇక్కడ అభివృద్ధి జరిగింది అంటే అది 2014 నుండి 2018 వరకు మాత్రమే నన్నారు.
సోలిపురం ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు మొదలు పెడతామని తెలిపారు.గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ ఈ తరహా సనస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు.