వ్యవసాయం రంగంలో విప్లవాత్మకమార్పులు: జగదీష్ రెడ్డి

297
Minister Jagadish Reddy
- Advertisement -

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను రూపొందించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అదే సమయంలో రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్బోధించారు.

సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట రూరల్, పెన్ పహాడ్, చివ్వేంల,ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రాలలో గురువారం రోజున ఆయన రైతువేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో మాట్లాడుతూ రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు.

తద్వారా పండించిన పంటకు మద్దతు ధర సాధించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన తెలిపారు.దశాబ్దాలుగా రైతాంగాన్ని ఓట్ల బ్యాంక్ లుగా చూసిన కాంగ్రెస్ వంటి పార్టీలకు రైతు బంధు,రైతు భీమా లతో పాటు రైతువేదికల నిర్మాణాలు,పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు కలలో కూడా వచ్చి ఉండేవి కావంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.45 ఏళ్ళు గా గోదావరి జలాల కోసం ఎదురు చూసి సూర్యపేట జిల్లా ప్రజలు దగా పడితే , తాము చెప్పిన ప్రకారం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చామన్నారు.

ఒకనాడు నీటి కోసం ధర్నాలు ..రాస్తారోకో లు జరిగితే నేడు మాకు ఇక నీళ్లు చాలు అన్న రోజులు వచ్చాయి.తెలంగాణా ఏర్పాటు అంటూ జరిగితే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రం చివరి కిరణం కర్ర పట్టుకుని బోధించిన నాడు ఇక్కడి కాంగ్రెస్ నేతలు అందరూ సీమాంధ్రుల మోచేతి నీళ్లు తాగిన వారేనని ఆయన గుర్తుచేశారు.ఆ చివరి కిరణమే కాదు అసలు కరెంట్ 24 గంటలు ఇవ్వొస్తుందా అన్న రీతిలో 24 గుంటల ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు.

రైతు వేదికల ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని….రైతులు అందరూ ఒకే వేదిక కిందకు వచ్చి తాము పండించే పంటలపై చర్చకు దిగితే అద్భుతమైన ఫలితాలు సాదించ వచ్చు అన్నారు.పొలాల వద్ద కళ్ళాలు వ్యవసాయ రంగంలో సంచలనాత్మకమైనవని ఆయన వర్ణించారు.కార్యక్రమంలో ఎంపీ బడుగుల, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాగాని, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య, సూర్యపేట నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ లు, జడ్పిటిసి లు, పిఏసీఎస్ చైర్మన్ లు, డైరెక్టర్లు ,రైతు బంధు సభ్యులు , పాల్గొన్నారు..

- Advertisement -