లాక్ డౌన్ పటిష్టంగా అమలు: మంత్రి జగదీష్ రెడ్డి

286
minister jagadeesh
- Advertisement -

లాక్‌ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి. హైదరాబాద్ చిత్రపురి కాలనిలో సిని ఆర్టిస్ట్ లకు సిని నిర్మాత కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బత్తాయి, కూరగాయలను అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడం లో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కరోనా మహమ్మరిని తరిమికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

బత్తాయి కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం..బత్తాయి వాడకం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బత్తాయి రైతులను అదుకుకోవడం లో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాం….రైతులకు మేలుచేసేందుకు ప్రతి ఒక్కరు బత్తాయి పండ్లను కొనుగోలు చేయాలి.దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.

బత్తాయి రైతులకు కావాల్సిన రవాణా వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని..రైతులు ఎవ్వరు ఇబ్బందులు పడవద్దు,అధైర్యపడవద్దన్నారు. ప్రజలందరు ప్రభుత్వం ,పోలీసులు సూచించిన నిబంధనలను పాటించాలన్నారు.

- Advertisement -