- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సోమవారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు. స్వామి వారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు.
స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇంద్రకరణ్ రెడ్డి. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు.
- Advertisement -