హరితోద్యమంతో ఆకుపచ్చగా తెలంగాణ:మంత్రి ఇంద్రకరణ్

308
ik reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితోద్యమంతో తెలంగాణ పచ్చగా మారి, నశించి పోయిన అడవులు పు:నర్జీవం అవుతున్నాయని అన్నారు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లాలో రాయగిరి, వడయి గూడం గ్రామాల్లో అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం,నరసింహ అరణ్యం అర్భన్ పార్క్ లను ఇంద్రకర్ రెడ్డి ప్రారంభించారు.

హైదరాబాద్ టు వరంగల్ హైవే పక్కన హరితహారం మొక్కలు నాటారు…యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యక్షేత్రం గా తీర్చిదిద్దుతున్నారని వచ్చే రోజుల్లో ఈ ప్రాంతమంతా పచ్చని అడవులతో, పార్క్ లతో భక్తులకు ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయత ను అందిస్తుందని మంత్రి తెలిపారు.

అడవులపై, ప్రకృతి పై మక్కువ కలిగేలా విద్యార్థులు కు ఎడ్యుకేషన్ అందించేలా అర్భన్ పార్క్ లను తీర్చిదిద్దామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు…….దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా స్వయంగా సీఎం కేసీఆర్ మొక్కలు నాటి హరితోద్యమానికి శ్రీకారం చుట్టారని ,ఫలితంగా నేడు తెలంగాణ పచ్చగా మారుతుందని అన్నారు.

గ్రామ పంచాయతీ ల్లో, మున్సిపాలిటీ లాల్లో 85 శాతం మొక్కలు బ్రతికేల ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ట్రాక్టర్ లను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దాని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు… ఈ కార్యక్రమంలో mp లింగయ్య యాదవ్, YTDA వైస్ ఛైర్మన్ కిషన్ రావు, యాదాద్రి ఆలయ EO గీత రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -