కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. ఇది అన్నదాతలు సాధించిన విజయం అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్ర దిగిరాక తప్పలేదు. రైతులకు మద్ధతుగా… వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుంది. వారి కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించిన అన్నదాతలకు అభినందనలు తెలిపారు మంత్రి ఇంద్రకరన్ రెడ్డి.