నిర్మల్ జిల్లా కేంద్రం బతిస్ ఘడ్ పక్కన రూ..2కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించనున్న మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ పనులకు శుక్రవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పోలిస్ హెడ్ క్వార్టర్స్ లో కన్వెన్షన్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైనా శుభ కార్యక్రమాలు, గెట్ టూ గెదర్, పదవీ విరమణ, అధికారక కార్యక్రమాలు ఇందులో చేసుకోనేలా వీలు ఉంటుందని అన్నారు. ఇతరులకు కూడా కన్వెన్షన్ సెంటర్ ను ఇస్తామని జిల్లా సూపరింటెండెంట్ తెలిపారని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా పోలీస్ శాఖను తీర్చి దిద్దామన్నారు. పోలీసులు తమ పని తీరుతో మంచి గుర్తింపు పొందరన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడీ పని చేసే శాఖ పోలిస్ శాఖ అన్నారు వారి పట్ల చాలా గౌరవం ఉందన్నారు. పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, అదనపు కలెక్టర్ హేమంత్, SP ప్రవీణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,అల్లోల సురేందర్ రెడ్డి, FSCS ధర్మజి రాజేందర్, ఎంపిపి రామేశ్వర్ రెడ్డి, DSP లు ఉపేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, నాయకులు ,కౌన్సెలర్లు, పొలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.