ప‌ల్లెలు, పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అల్లోల

196
Minister Indrakaran Reddy
- Advertisement -

ప‌ల్లెలు, పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం కృత‌నిశ్చ‌యంతో ప‌ని చేస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్‌లో పట్టణ ప్రగతిలో భాగంగా శివాజీ చౌక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వ‌ర‌కు రూ. 5.50 కోట్ల వ్య‌యంతో చేపట్టిన రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మునిసిపాలిటీలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు పట్టణ ప్రగతి కార్య‌క్రమానికి శ్రీకారం చుట్టార‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామ, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు నెల‌నెల నిధులు మంజూరు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయని, రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌కు కూడా వ్యాపారులు, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు పూర్తిగా స‌హాక‌రించ‌డంతో ప‌నులు చ‌క‌చ‌కా సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు. అన్ని వ‌ర్గాల‌ను భాగస్వాములను చేస్తూ.. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామ‌ని తెలిపారు. రానున్న రోజుల్లో రూ.28 కోట్ల‌తో మ‌రిన్ని అభివృద్ధి ప‌నులు చేప‌డుతామ‌న్నారు.

పట్టణ ప్రగతితో ముందుగా పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చుకుందామని చెప్పారు. ఎక్కడ కూడా చెత్త లేకుండా నీటుగా ఉంచుకోవాలని సూచించారు. ఎవరి ఇంటి పరిసరాలను వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పోడి చెత్తను వేర్వురుగా చేసి ఇంటికి వచ్చే చెత్త బండితో వేయాలని మంత్రి సూచించారు. పారిశుద్యం లోపించకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,టీఆర్‌ఎస్‌ టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -