పేద‌ల క‌డుపు నింపేందుకు కొత్త రేషన్ కార్డులు- మంత్రి ఐకే రెడ్డి

114
- Advertisement -

సోమవారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో లబ్దిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందేజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద‌ల క‌డుపు నింపేందుకు సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా 20,129 రేషన్ కార్డులు మంజూరయ్యాయని, నిర్మల్ జిల్లాలో కొత్తగా 5,851 మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. కొత్త రేషన్ కార్డు లబ్దిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

- Advertisement -