యంగ్‌టైగర్‌ వదిలిన ‘తిమ్మరుసు’ ట్రైలర్..

127

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. జులై 30న థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ వదిలారు. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేయించారు.

లాయర్ రామచంద్రగా సత్యదేవ్ పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. కేసును గెలిపించడం కోసం అవసరమైతే తన డబ్బును ఖర్చు చేసే నిజాయతీ పరుడిగా ఆయన పాత్రను చూపించారు. అలా అందరికీ సాయం చేస్తూ, కారు నుంచి బైక్ రేంజ్ కి పడిపోయిన తీరును గురించి చెప్పారు. ఈ కథ అంతా కూడా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది.

“నీ ముందున్నది ‘వాలి’ అని మరిచిపోకు లాయర్ రామచంద్ర .. ఎదురుగా వస్తే సగం బలం లాగేస్తా” అని క్రిమినల్ అంటే, “నువ్వు సగం బలం లాగే వాలివైతే, దండేసి దండించే రాముడి లాంటివాడిని నేను” అని హీరో చెప్పే డైలాగ్ హైలైట్ గా అనిపిస్తోంది. ఈ మూవీలో టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో కచ్చితంగా సినిమా కూడా అలరిస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ప్యాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైన తొలి సినిమా ఇదే. జులై 30న తిమ్మరుసు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Thimmarusu Movie Trailer 4K | Satyadev | Priyanka Jawalkar | Brahmaji | Ankith | Sharan Koppisetty