అనాథ పిల్లలకు అండగా ఉంటామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ పట్టణంలో బాలల సహాయ వాణి వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఇంద్రకరణ్…సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొవిడ్ తో కన్నవారిని కొల్పోయిన పిల్లలను చేరదీసి సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అనాథ పిల్లలు రోడ్డున పడితే సమాజానికి నష్టమని, అటువంటి పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తే ఉత్తమ పౌరులను అందించిన వారమవుతామన్నారు. కరోనా సోకి తల్లిదండ్రులను కొల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కాల్ సెంటర్ కు కాల్ వచ్చిన 24 గంటల్లో అనాథ పిల్లలను ఈ వ్యాన్ లో జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తారని చెప్పారు. బాలికలను కేజీవీబీ విద్యాలయానికి, బాలురను భైంసాలోని వివేకానంద స్కూల్ లో చేర్పించి విద్యను అందిస్తామని పేర్కొన్నారు.