పర్యావరణహిత విగ్రహాలను ప్ర‌తిష్టిద్దాం:మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

290
indrakaran reddy
- Advertisement -

కరోనా నేపథ్యంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జ‌రుపుకోవాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. జన సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు వద్దని సూచించారు.

కరోనా మహమ్మారి ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రంజాన్, ఉగాది, శ్రీరామ నవమి, బోనాల‌ వంటి పండుగలను నిరాడంబరంగా జ‌రుపుకున్నామ‌ని వినాయ‌క చ‌వితి పండ‌గ‌ను కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా నిర్వ‌హించుకోవాల‌ని, దీనికి ప్ర‌జ‌లంద‌రూ స‌హాక‌రించాల‌ని కోరారు. పర్యావరణహిత వినాయ‌క‌ ప్రతిమల‌నే ప్ర‌తిష్టించాల‌ని సూచించారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఆద్వ‌ర్యంలో మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -