- Advertisement -
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామని… అన్ని శాఖల సమన్వయం, ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వస్తున్నామని ఇంద్రకరణ్ తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటిసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మట్టితో తయారు చేసినందుకు ఉత్సవ సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
మట్టి, గోమయంతో గణపతిని చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిందన్నారు.
- Advertisement -