నిర్మల్ జిల్లాకు అందరి నుండి ప్రశంసలు- మంత్రి అల్లోల

221
- Advertisement -

నిర్మల్ జిల్లా కేంద్రాన్ని మహా నగరాల వలే అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం నిర్మల్ పట్టణం శివాజీ చౌక్ మంచిర్యాల చౌరస్తా నుండి గాజుల్ పెట్ చౌరస్తా వరకు రూ.5 కోట్ల 30 లక్షలతో చేపట్టనున్న రహదారి సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రాన్ని మహా నగరాలను తలపించే విధంగా సుందరీకరిస్తున్నామని అన్నారు. శివాజీ చౌక్ నుండి గాజుల్ పెట్ వరకు రహదారులు, శివాజీ చౌక్, అంబెడ్కర్ చౌక్ అభివృద్ధి, ఫుట్ పాత్ లు, పారా లాల్ పార్కింగ్, గ్రీన్ జోన్ , టాయిలెట్స్, బస్ షెల్టర్లు, నిర్మిస్తున్నామని 4 నెలల నుండి 6 నెలల్లో పనులు పూర్తవుతాయని అన్నారు..

కడ్తాల్ నుండి మంచిర్యాల చౌరస్తా వరకు 4 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులు ప్రారంభం అయ్యాయని.. గాజుల్ పెట్ నుండి ఆలూర్ వరకు 4 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామని.. నిర్మల్ ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లాకు అందరి నుండి ప్రశంసలు వస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ వచ్చాక నిధులు ఖర్చు చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అనంతరం శివాజీ చౌక్ ను మంత్రి సందర్శించారు.

- Advertisement -