కవయిత్రి మొల్ల జయంతి వేడుకల్లో మంత్రి అల్లోల..

207
- Advertisement -

తెలంగాణ కుమ్మర సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తొలి తెలుగు కవయిత్రి మొల్ల మాంభ వేడుకలు నిర్మల్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీసు ఎదురుగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రికి కుమ్మరి సంఘ కులస్తులు ఘనంగా స్వాగతం పలికారు..త్వరలో ఏర్పాటు చేయనున్న మొల్ల కాంస్య విగ్రహ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని తెలుగు భాష లోకి అనువదించిన ఘనత కవయిత్రి మొల్ల మాంబ కె దక్కిందన్నారు.విగ్రహ ప్రతిష్టాపనకు గద్దె నిర్మాణమును మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మించనున్నట్లు తెలిపారు..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి,మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, FSCS చైర్మన్ ధర్మాజీ రాజేందర్, అల్లోల మురళీధర్ రెడ్డి,రాం చందర్,కుమ్మర సంఘం రాష్ట్ర రాజకీయ విభాగం ఉపాధ్యక్షులు కొత్తపల్లి బుచ్చన్న, రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సురేష్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్ మరియు కుమ్మరులు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -