ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీరు విడుదల చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు… సిఎం నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో జీవించాలనీ భవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు.
కేసిఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదు…. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు.. రంగనాయక సాగర్ జలాశయం ఉండేది కాదు . సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావు అన్నారు. కేసిఆర్ కారణ జన్ముడు…. గొప్ప కార్యం కోసం పుట్టిన మహాత్ముడు అన్నారు. స్వరాష్ట్రం తెలంగాణను స్వప్నిoచిండు, సాకారం చేసిండు, సిఎంగా ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాడన్నారు.
గుక్కెడు నీళ్ల కోసం తపించిన తెలంగాణను సమృద్దిగా సాగు జలాలతో ఆకుపచ్చ తెలంగాణ, సస్య శ్యామల తెలంగాణ మార్చాడన్నారు. అన్ని వర్గాలు, ప్రాంతాల అభివృద్ధి కోసం సిఎం కృషి చేస్తున్నారు…. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు. 7 సంవత్సరాల లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారన్నారు. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందన్నారు. రైతుల ఆకాంక్షల మేరకు ఎడమ కాలువ ద్వారా సాగు జలాల విడుదల చేపట్టామన్నారు. కలలో ఊహించని విధంగా మూడున్నర ఏండ్ల లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించుకున్నాం…. 24 గంటల నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాల తో సమకూర్చుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం అన్నారు.