- Advertisement -
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. 2019-20 సంవత్సరాలకు మరియు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2014, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) కింద గ్రాంట్లు, 900 కోట్ల రూపాయలు ఇంకా విడుదల కాలేదని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ. 450 కోట్ల వార్షిక గ్రాంట్ అవసరమైన రూ. 30,751 కోట్ల కంటే తక్కువగా ఉంది. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన రూ. 24,205 కోట్ల మొత్తాన్ని, 900 కోర్ విడుదలతో పాటు, గ్రాంట్‌ను 2021-22 తర్వాత ఐదేళ్ల పాటు పొడిగించాలని తెలిపారు.
- Advertisement -