బుగ్గరాజేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌…

105
harishrao
- Advertisement -

నారాయణరావుపేట బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌…బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం అంటే ఈ ప్రాంత ప్రజలకు నమ్మకం. విశ్వాసం. విశిష్టమైన, ప్రాశస్తమైన దేవాలయం. ఆ రాజేశ్వరుడిని కొలిచి మొక్కులు మొక్కితే.. తప్పకుండా తీరుస్తాడు.. ఆ బుగ్గరాజేశ్వరుడని భక్తులు నమ్ముతారన్నారు.

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఖాతా మహాదేవ ఆలయం, సలేంద్రి శివాలయం, పుల్లూరు శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయాలు ఎంతగానో అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. కోర్టు చిక్కుముడుల కారణంగా బుగ్గరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికై ముందుకు పోలేక పోయామని తెలిపారు.

ఆలయ పాలక వర్గం, సభ్యులు చర్చించి, చొరవ చూపితే బద్ధిపోచమ్మ ఆలయ అభివృద్ధి, సత్రం, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ 15 రోజుల్లో మంజూరు చేయిస్తానని, అవసరమైతే రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకూ నిధులు కేటాయింపు చేస్తానని మంత్రి హామీనిచ్చారు. ఎన్నో ఏండ్ల కల తెలంగాణ రాష్ట్రం నెరవేరిందని, కాబట్టే ఈ రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలు తెచ్చుకున్నట్లు, లేదంటే బొంబాయి, దుబాయి బతుకులుగా మనం ఉండేవారమని మంత్రి చెప్పుకొచ్చారు.

- Advertisement -