స్వామివారికి స్వర్ణ కిరీటం..

20
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఏకాదశి పర్వదినం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించి ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తున్నారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులకు సీతారామ చంద్రమూర్తి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ తల్లి కొలువుదీరారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -