రైతుల్లో చైతన్యం తేవాలి: హరీశ్ రావు

157
harish rao
- Advertisement -

రైతుల్లో చైతన్యం తెచ్చి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని తోర్నాల పాలిటెక్నిక్‌ కాలేజీ, మొక్కజొన్న విత్తన పరిశోధనా సంస్థను తనిఖీ చేశారు హరీశ్‌ రావు. ఈ సందర్భంగా అనుభవజ్ఞులైన శాస్తవ్రేత్తలుగా ఇప్పటివరకు ఏవిధమైన మార్పు తేగలిగామనే విషయంపై చర్చించారు.

అనంతరం మాట్లాడిన హరీశ్ రావు.. జిల్లాలో కాళేశ్వరం నీళ్లు వచ్చాక రైతులు పొద్దు తిరుగుడు పంట వేయడంలేదని, వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా మనం కూడా మారలని, రైతుల ఆదాయం పెరిగేలా కృషి చేయాలని సూచించారు. మొక్కజొన్న, వరి పంటలు కాకుండా ఇతర పంటల సాగుపై రైతులతో ముఖాముఖి జరిగేలా ప్రతి గ్రామాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు దత్తత తీసుకోవాలని కోరారు.

మొదటి ప్రాధాన్యతగా వానాకాలం, యాసంగి పంటల్లో 50 ఎకరాల్లో 50 మంది రైతుల జీవితాల్లో మార్పు తేవడం లక్ష్యంగా ముందుకు వెళ్దామని, ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో నిర్వహించే రైతు సదస్సులో శాస్త్రవేత్తలతో పాటు తాను కూడా పాల్గొంటానని చెప్పారు. తోర్నాలకు 3 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల రైతులతో ముఖాముఖి ప్రారంభించి వారిలో చైతన్యం కలిగిస్తే.. మిగతా గ్రామాలవారు ముందుకొస్తారని, దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

- Advertisement -