కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గొప్ప చట్టం అన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా కంది ఎమ్మెర్వో ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు…ఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్, ముటేషన్, పట్టాపాసు బుక్ జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా పదిహేను నిమిషాల్లో ముగుస్తుంది.. కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన గొప్ప చట్టం అన్నారు. పారదర్శక పెంచేందుకే కొత్త చట్టం….సాదా బైనామాతో ఉన్న రైతులు పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. పట్టా భూమి కలిగి పట్టా రైతులు ఉండరాదు.…ధరణితో కొత్త చరిత్రకు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. 10వ తేదీలోపు సాదా బైనామాల రైతులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.