నిజామాబాద్‌లో జోరుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్..

72
green

రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి ఎమ్మార్వో మల్లేష్ , ఎంపీడీవో భారతి . ఈ సందర్బంగా తహసీల్దార్ మల్లేష్ మాట్లాడుతూ రోజు వారి పనులు ఎన్ని ఉన్న , ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని , పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని , ఎంపీ సంతోష్ కుమార్ గారు మంచి కార్యక్రమం చేపట్టారని తెలిపారు.

ఇందులో భాగస్వామ్యం అవడం చాల అదృష్టంగా భావిస్తున్న అని ,ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురికి తలసీల్దార్ ఇందల్వాయ్ , సిరికొండ , ఎంపిడివో ఎన్ భారతి గార్లకి ఛాలెంజ్ చేశారు .

ఎమ్మార్వో మల్లేష్ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు మొక్కలు నాటిన ఎంపీడీవో యన్. భారతి. ఈ సందర్బంగా ఎంపిడివో మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు . మరో ముగ్గురికి ఆర్మూర్ M PDO గీరి బాబు, జక్రాంపల్లి ఉపా సర్పంచ్ బాలకృష్ణ గారు , కలిగోట్ సర్పంచ్ చేతన రెడ్డికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.